కడప జిల్లా పోలీసు అధికారులు రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు 'ఫేస్ వాష్ అండ్ గో' అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. అర్ధరాత్రి తర్వాత వాహనాలు నడిపే డ్రైవర్లకు నీటితో ముఖం కడుక్కోవాలని సూచిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుండి సోమవారం తెల్లవారుజామున వరకు కడప నగర శివారులో ఈ కార్యక్రమం నిర్వహించారు. కుటుంబసభ్యులను గుర్తుంచుకొని జాగ్రత్తగా వాహనం నడపాలని డ్రైవర్లకు పోలీసులు సూచించారు.