వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు 'ఫేస్ వాష్ అండ్ గో' కార్యక్రమాన్ని చేపట్టారు. సోమవారం అర్ధరాత్రి దాటి మంగళవారం తెల్లవారుజామున వరకు లారీలు, బస్సులు, కార్ల డ్రైవర్లను ఆపి, నిద్రమత్తు వదిలేలా నీటితో ముఖం కడిగించారు. వాహనాలు నడిపేటప్పుడు కుటుంబ సభ్యులను గుర్తుచేసుకుని జాగ్రత్తగా వెళ్లాలని, ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని పోలీసులు డ్రైవర్లకు సూచనలు చేశారు.