లింగాల(M) చిన్నగుడాల గ్రామానికి చెందిన రైతు శివనారాయణరెడ్డి అరటి తోటలో బుధవారం విద్యుత్ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరు ఎకరాల తోటలోని అరటి గెలలు కాలి బూడిదయ్యాయి. రెండో పంటకు నష్టం వాటిల్లడంతో రైతుకు సుమారు రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లిందని అంచనా. అరటి చెట్లతో పాటు డ్రిప్ ఇరిగేషన్ పైపులు, పోటు కట్టెలు కూడా కాలిపోయాయని రైతు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.