కడపలో ఇంధన రేషనలైజేషన్ అమలు

5చూసినవారు
కడపలో ఇంధన రేషనలైజేషన్ అమలు
కడప జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతను నివారించడానికి కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి రేషనలైజేషన్ అమలు చేశారు. దీని ప్రకారం, కార్లకు 30 లీటర్లు, బస్సులు, లారీలకు 100 లీటర్లు, వరికోత యంత్రాలకు 80 లీటర్ల డీజిల్ మాత్రమే సరఫరా చేయబడుతుంది. అత్యవసర వాహనాలకు ఈ పరిమితి వర్తించదు. బాటిళ్లు, క్యాన్లలో ఇంధనం అమ్మడం నిషేధించబడింది. బ్లాక్ మార్కెట్ సృష్టించేవారు, వదంతులు వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్