కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నానాపల్లిలో శుక్రవారం పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 92,950 నగదు, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఓబులేసు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ దాడిలో ఎస్సైలు రాజరాజేశ్వర రెడ్డి, రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.