గాంధీనగర్ పార్కుకు ఎద్దుల ఈశ్వర్ రెడ్డి పేరు

2చూసినవారు
గాంధీనగర్ పార్కుకు ఎద్దుల ఈశ్వర్ రెడ్డి పేరు
కడప నగరంలోని గాంధీనగర్ స్కూల్ ఎదురుగా ఉన్న ఫౌంటెన్ గ్రీన్ పార్కుకు స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఎంపీ ఎద్దుల ఈశ్వర్ రెడ్డి పేరు పెట్టాలని నగర పాలక సంస్థ ఏకగ్రీవంగా తీర్మానించింది. మేయర్ సురేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ తీర్మానానికి కృషి చేసిన మేయర్‌ను సీపీఐ నగర కార్యదర్శి వెంకట శివ, ఇతర నాయకులు కలిసి మొక్కను బహూకరించి సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్