సిద్ధవటం మండలం బాకరాపేటలోని బస్టాండ్ కూడలి వద్ద బద్వేలు డిపోకు చెందిన బస్సులు ఆగడం లేదని శనివారం ఓ మహిళ బస్సుకు అడ్డంగా నిలబడి నిరసన తెలిపారు. గంటల తరబడి వేచి ఉన్నా ఒక్క బస్సు కూడా ఆగకపోవడంతో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులు బస్సుల సంఖ్య పెంచి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.