ఖాజీపేట: 'మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాడు'

13చూసినవారు
ఖాజీపేట: 'మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాడు'
ఖాజీపేట (M) బి.కొత్త పల్లె గ్రామానికి చెందిన ముత్తూర్ హృషి కేశవ రెడ్డి గ్రూప్ 2 (ఏఎస్ఓ జిఏడి)ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఈయన గతంలో 2019-23 వరకు కూనవారి పల్లె గ్రామ సచివాలయ సెక్రెటరీగా, 2023లో బ్రహ్మంగారిమఠంలో రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేశారు. ప్రస్తుతం గ్రూప్ -2 లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, (సాధారణ పరిపాలన శాఖ) ఉద్యోగం లభించింది. ఈయన మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం విశేషం.