ఖజీపేట(M) చెన్నముక్కపల్లె వద్ద కడప-కర్నూల్ హైవేపై ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్ దీపం ధ్వంసమైంది. కొన్ని నెలల క్రితం ఒక టెంపో వాహనం వేగంగా వచ్చి సిగ్నల్ దీపాన్ని ఢీకొనడంతో అది ఒరిగిపోయింది. దీంతో డివైడర్ రైలింగ్ కూడా పాడైంది. జాతీయ రహదారి విభాగ అధికారులు వెంటనే స్పందించి, దెబ్బతిన్న సిగ్నల్ దీపాన్ని పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.