కడప శిల్పారామంలో ఘనంగా ముగ్గుల పోటీలు

6చూసినవారు
కడప శిల్పారామంలో ఘనంగా ముగ్గుల పోటీలు
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆదివారం కడప శిల్పారామంలో 'మిస్ప' ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు అట్టహాసంగా జరిగాయి. ఈ పోటీలలో 35 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కడపకు చెందిన అరుణకుమారి ప్రథమ స్థానంలో నిలవగా, ప్రొద్దుటూరుకు చెందిన సుమలత ద్వితీయ, రమాదేవి తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నారు. విజేతలకు పోడార్ పాఠశాల ప్రిన్సిపాల్ విజయ్ మాధవిశర్మ నగదు బహుమతులు అందజేశారు. మిగిలిన వారికి మలబార్ గోల్డ్, కాంటినెంటల్ కాఫీ సంస్థలు బహుమతులు అందించాయి. అనంతరం సాయంత్రం కిషోర్, సుదేశ్ మాస్టర్ల ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయని ఏవో కృష్ణ ప్రసాద్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్