2026 నూతన సంవత్సరం సందర్భంగా గురువారం కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరిని క్యాంపు కార్యాలయంలో పలువురు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు, పండ్లు, స్వీట్లు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారికి ధన్యవాదాలు తెలిపి, తిరిగి శుభాకాంక్షలు చెప్పారు.