గుండెపోటు రోగికి ఉచిత సూదిమందుతో ప్రాణాపాయం నుంచి విముక్తి

3చూసినవారు
గుండెపోటు రోగికి ఉచిత సూదిమందుతో ప్రాణాపాయం నుంచి విముక్తి
జమ్మలమడుగు ప్రాంతీయ వైద్యశాలలో బుధవారం ఒక గుండెపోటు రోగికి రూ.45 వేల విలువైన సూదిమందును ఉచితంగా అందించి వైద్యులు ప్రాణాలు కాపాడారు. పెద్దముడియం మండలం బలపనగూడూరు గ్రామానికి చెందిన 65 ఏళ్ల మార్క్కు ఈ నెల 2న గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి, గుండెకు రక్త సరఫరా చేసే ప్రధాన నాళంలో బ్లాక్ ఏర్పడినట్లు నిర్ధారించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న సూది మందును 30 నిమిషాల్లోనే ఇవ్వడంతో రోగి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. అనంతరం మెరుగైన చికిత్సకు కడప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య బృందానికి రోగి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.