ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో, ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న కడప వాసుల భద్రతపై ప్రభుత్వం అప్రమత్తమైందని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. యుద్ధ ప్రాంతాల్లో జిల్లా వాసులు లేదా వారి బంధువులు ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, తక్షణ సహాయం కోసం 08562-246344 టోల్‌ఫ్రీ నెంబర్‌కు సంప్రదించాలని సూచించారు. ఈ సమాచారం అందిస్తే, ప్రభుత్వపరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.