గంజాయి వ్యాపారంలో హోంగార్డు: పోలీసులే పట్టిచ్చారు

13చూసినవారు
గంజాయి వ్యాపారంలో హోంగార్డు: పోలీసులే పట్టిచ్చారు
కడప నగరంలో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేయగా, పట్టుబడిన వారిలో కంట్రోల్ రూమ్‌లో పనిచేస్తున్న హోంగార్డు రమేష్ ఉన్నట్లు తేలింది. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో రమేష్ ఈ దందాకు పాల్పడినట్లు అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు తెలిపారు. ఉద్యోగానికి సెలవు పెట్టి ఒరిస్సా బోర్డర్ నుంచి గంజాయి కొనుగోలు చేసి, పోలీసు ఐడెంటిటీ కార్డును అడ్డం పెట్టుకుని కడపకు చేర్చినట్లు వెల్లడించారు. తోటి పోలీసులే అతడిని అదుపులోకి తీసుకున్నారు.