కడపలో భారీ ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

0చూసినవారు
కడపలో భారీ ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
కడప శాస్త్రి నగర్‌లో ఐపీఎల్ బెట్టింగ్ స్థావరంపై తాలూకా పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. ఎస్పీ నచికేత్ విశ్వనాధ్ ఆదేశాల మేరకు ప్రధాన నిందితుడు జనార్ధన్ రెడ్డితో సహా పలువురిపై కేసు నమోదు చేశారు. వారి వద్ద నుంచి రూ. 7,00,550 నగదు, 5 మొబైల్స్, ల్యాప్‌టాప్, రూ. లక్ష విలువైన 12 అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసులను ఎస్పీ అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్