కడపలో సోమవారం జరిగిన వైసీపీ జోన్ కమిటీల భేటీలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యే మాధవిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కార్యకర్తల జోలికొస్తే 5వేల మందితో వస్తానని, అక్రమ కేసులు బనాయించే అధికారుల పేర్లను డిజిటల్ బుక్‌లో నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్పొరేషన్‌లో 50 సీట్లు తమవేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ భేటీలో రవీంద్రనాథ్ రెడ్డి, సురేష్ బాబు, రామచంద్రారెడ్డి, మేయర్ ముంతాజ్, నిత్యానందరెడ్డి పాల్గొన్నారు.