కడపలో బుధవారం జరిగిన సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, పరిశీలకులు సురేష్ బాబు పాల్గొన్నారు. కమిటీల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయాలని అంజాద్ భాషా ఆదేశించారు. జగనన్న 2.0 వేరే లెవెల్‌లో ఉంటుందని, కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం 18 నెలలైనా ఏ పథకం అమలు చేయలేదని విమర్శించారు. 2029లో వైసీపి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.