జమ్మలమడుగు నియోజకవర్గంలోని గండికోట ఉత్సవాలలో హెలికాప్టర్ రైడింగ్ ధరలను తగ్గించినట్లు కలెక్టర్ శ్రీధర్ శనివారం తెలిపారు. గతంలో రూ. 5 వేలుగా ఉన్న ధరను ఇప్పుడు రూ. 3 వేలకు తగ్గించారు. ఈ రైడింగ్ 6 నిమిషాల పాటు కొనసాగుతుంది. దీని ద్వారా గండికోట పరిసర ప్రాంతాలు, గండికోట ప్రాజెక్టు, మైలవరం జలాశయాన్ని వీక్షించే అవకాశం కలుగుతుంది.