మీడియా అకాడమీ చైర్మన్‌కు విలేకరుల సమస్యలకు 'జాప్' వినతి..

3చూసినవారు
మీడియా అకాడమీ చైర్మన్‌కు విలేకరుల సమస్యలకు 'జాప్' వినతి..
కడపలో రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్‌ను జాప్ జర్నలిస్ట్ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. పాత్రికేయులు ఎదుర్కొంటున్న ఇళ్ల స్థలాలు, పెన్షన్ల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పాలసీ పేరుతో ఇళ్ల స్థలాల కేటాయింపులో జాప్యం జరుగుతోందని, వెంటనే ప్రక్రియను ప్రారంభించి సాయం అందించాలని కోరారు. దీనిపై చైర్మన్ సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి త్వరలోనే కృషి చేస్తానని జాప్ నాయకులకు గట్టి భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్