ఆటోలో మర్చిపోయిన రూ. 4 లక్షల విలువైన ఆభరణాలు అప్పగింత

8చూసినవారు
ఆటోలో మర్చిపోయిన రూ. 4 లక్షల విలువైన ఆభరణాలు అప్పగింత
కడప ప్రకాష్ నగర్‌కు చెందిన కొమ్మునూరి మానస నిన్న బద్వేల్ నుంచి వస్తూ ఆటోలో తన హ్యాండ్ బ్యాగును మర్చిపోయారు. అందులో రూ. 4 లక్షల విలువైన 50 గ్రాముల బంగారం, 100 గ్రాముల వెండి వస్తువులు ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు సీసీ కెమెరాల ద్వారా ఆటోను గుర్తించారు. ఆటో డ్రైవర్ షేక్ ఖాజామొహిద్దీన్ బ్యాగును సురక్షితంగా అప్పగించారు. డ్రైవర్ నిజాయితీని గుర్తించి పోలీసులు అభినందించి, రూ. 500 ప్రోత్సాహకం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్