కడప హబ్ నిర్మాణంతో యువతకు ఉద్యోగ అవకాశాలు

4చూసినవారు
కడప హబ్ నిర్మాణంతో యువతకు ఉద్యోగ అవకాశాలు
కడప ఆర్ట్స్ కాలేజ్ సమీపంలో రూ. 10 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న స్టార్టప్ కడప హబ్ నిర్మాణం వేగంగా సాగుతోంది. బుధవారం జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, ప్రాబరీ అధికారి సిద్ధార్థ్ జైన్ నిర్మాణ పనులను పరిశీలించారు. 25, 000 చదరపు అడుగుల విస్తీర్ణంలో జి+3 అంతస్తుల భవనం రూపుదిద్దుకుంటోంది. స్థానిక షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ రూ. 4 కోట్లు విరాళంగా అందించింది. ఈ హబ్ యువత కలలకు, దళితాదరణ ఉద్యోగాలకు వేదికగా నిలుస్తుందని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్