కడప: మన్యం వీరుడు అల్లూరికి ఘన నివాళి

18చూసినవారు
కడప: మన్యం వీరుడు అల్లూరికి ఘన నివాళి
కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. అదనపు ఎస్పీ ప్రకాష్ బాబు అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి, పరిమిత వనరులతో బ్రిటిష్ వారి నిరంకుశత్వంపై అల్లూరి సాగించిన పోరాటం తెలుగు జాతి చరిత్రలో గొప్ప ఘట్టమని, ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. పోలీస్ సంఘం నేతలు, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్