కడప జిల్లా పోలీసు శాఖలో ఎవరైనా తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. సీకేదిన్నె పోలీసు స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి ఘటనలో కానిస్టేబుల్ పాత్ర ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. రాజారెడ్డి వీధిలో పేకాట ఆడుతూ పట్టుబడిన ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లు, సివిల్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి, విచారణ అనంతరం సస్పెండ్ చేస్తామని తెలిపారు.