కడప 2 టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం పెద్దలతో సీఐ శ్రీహరి సమావేశం నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. గోవధ, నిషేధిత జంతుబలులు చేయకూడదని, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రఫీక్ పాల్గొన్నారు.