కడప: రీల్స్ కోసం బైక్ రైడ్.. యువకుడి మృతి

5చూసినవారు
కడప: రీల్స్ కోసం బైక్ రైడ్.. యువకుడి మృతి
కడప నగరంలో అర్థరాత్రి ఒంటిగంట సమయంలో రీల్స్ కోసం బైక్ రైడ్ చేస్తున్న ముబారక్ అనే యువకుడు డివైడర్‌ను ఢీకొని మృతి చెందాడు. బైక్ పై నుంచి కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన అతడితో పాటు ఉన్న మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించారు. పోలీసులు నిఘా పెట్టినా, డ్రోన్లతో గాలిస్తున్నా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని, తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి సారించాలని, పోలీసులు రీల్స్ చేసే యువతకు కౌన్సెలింగ్ ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్