అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు, ఇళ్లు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ, కూటమి సర్కార్ పేదలను విస్మరించిందని విమర్శించారు. స్థానిక సమస్యలపై నేటి నుంచి 12 రోజులు యాత్రలు చేపడతామని, డిసెంబర్ 16న చలో కార్పొరేషన్ ద్వారా ఆందోళన చేస్తామని, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.