కడప కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన సమీక్షలో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, డీఎఫ్ఓ వినీత్ కుమార్ నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల మట్టం పెంపుకై క్షేత్రస్థాయిలో ప్రణాళికలు అమలు చేసి వంద శాతం లక్ష్యాలు సాధించాలని అధికారులను ఆదేశించారు. వాగులు, చెరువుల అనుసంధానం, సాగునీటి పొదుపు, వర్షపు నీటిని ఒడిసిపట్టడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.