కడప: పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ శ్రీకారం

8చూసినవారు
కడప: పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ శ్రీకారం
కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి దీర్ఘకాలిక ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. బుధవారం కలెక్టరేట్‌లో ప్రత్యేక పిజిఆర్ఎస్ నిర్వహించి, రెవెన్యూ, భూ సమస్యలపై దృష్టి సారించారు. అర్జీదారులతో స్వయంగా మాట్లాడి, రికార్డులు పరిశీలించి సమస్యలను పరిష్కరించారు. పెండెన్సీని సున్నా చేసేలా చర్యలు చేపట్టి, వచ్చిన వారికి భోజన సదుపాయాలు కల్పించడంతో వారు హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్