కడప కమిషనర్ రాకేష్ చంద్ర సోమవారం నగరంలో మార్నింగ్ విజిట్ చేశారు. 12వ డివిజన్‌లో చెత్త కుప్పల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టడంతో ఆ ప్రాంతం శుభ్రంగా మారడాన్ని ఆయన గమనించారు. పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. నగరాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచడానికి ప్రజలు కార్పొరేషన్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.