కడప నగరపాలక సంస్థలో దాదాపు 540 మంది అదనపు కోవిడ్ వర్కర్లు విధుల్లో ఉన్నట్టుగా చూపించారని, అయితే నిజంగా అంతమంది పని చేయడం లేదని మున్సిపల్ యూనియన్ సభ్యులు ఆరోపించారు. హాజరు లేకుండానే కొందరు జీతాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మేయర్ సురేశ్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు.