కడప నగరపాలక సంస్థ కార్యాలయంలో అక్రమంగా ప్రజల నుంచి చెత్త పన్ను వసూలు చేసిన వారిపై సమగ్రంగా విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ శ్రీధర్ కు లేఖ రాసి జేసీ స్థాయి అధికారితో సమగ్రంగా దర్యాప్తు చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చెత్త పన్ను వసూలు చేయకూడదని జీవో సైతం జారీ చేసినా కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శించారన్నారు.