
నిమెసులైడ్ అధిక డోసులపై కేంద్రం నిషేధం
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నోటి ద్వారా తీసుకునే ప్రముఖ పెయిన్‌కిల్లర్ ఔషధం నిమెలుసులైడ్ అధిక డోసుల తయారీ, విక్రయాలపై ఆంక్షలు విధించింది. 100 ఎంజీకి మించి డోసు ఉన్న ఔషధాల తయారీ, విక్రయాలను వెంటనే ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డుతో చర్చించిన తర్వాత కేంద్ర ఆరోగ్యశాఖ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. అధిక డోసుల వల్ల ఆరోగ్యానికి ప్రమాదం జరిగే అవకాశం ఉందని, ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది.




