కడప జిల్లా వ్యాప్తంగా కాంట్రాక్ట్ 2 ఎఎన్ఎంలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని గురువారం కడప సీఐటీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కామనూరు శ్రీనివాసులురెడ్డి, కార్యదర్శి ఎం. వి. నారాయణమ్మ డిమాండ్ చేశారు. తక్కువ వేతనాలతో దూర ప్రాంతాలకు బదిలీ చేసిన 2 ఎఎన్ఎంలను తిరిగి స్థానిక ప్రాంతాలకు పంపాలని, వేతనాలు, ఇన్సెన్టివ్‌లు, యూనిఫామ్ అలవెన్సులు, రిటైర్మెంట్ సదుపాయాలు అందించాలని వారు కోరారు.