కడప నగరంలోని అనేక ప్రాంతాల్లో దశాబ్దాలు గడుస్తున్నా త్రాగునీరు, రోడ్లు, మురికి కాలువలు వంటి మౌలిక వసతులు లేవని, ఇది దారుణమని సీపీఐ నగర కార్యదర్శి యన్ వెంకట శివ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక సమస్యలపై సీపీఐ సమరభేరి కార్యక్రమంలో భాగంగా నగర సౌత్ జోన్ పరిధిలోని 14, 16 వ డివిజన్లలో సీపీఐ నాయకులు ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ మౌలిక స్థానిక సమస్యలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు పాల్గొన్నారు.