కడపలోని సరోజినీ నగర్ టిడ్కో ఇళ్లను తక్షణమే నివాసయోగ్యంగా మార్చాలని సీపీఎం నేత రామమోహన్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఆ ఇళ్లను సందర్శించి, నీరు, విద్యుత్ లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించారు. మీటర్లను దొంగలు ఎత్తుకెళ్తున్నారని, అడ్డుకున్న సిబ్బందిపై దాడులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. లబ్ధిదారులకు వెంటనే వసతులు కల్పించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.