కడప నగర అభివృద్ధి కూటమి ఆధ్వర్యంలో కొనసాగుతుండగా, కులం, మతం పేరుతో విమర్శించడం సరికాదని టీడీపీ యువనేత వలసిగండ్ల సుబ్బరాయుడు అన్నారు. వైసీపీ కో ఆప్షన్ సభ్యుల దిగజారుడు మాటలు మంచి పద్ధతి కాదని, అభివృద్ధిపై దమ్ముంటే చర్చించాలని, కులం పేరుతో కించపరిచే మాటలు ప్రజలకు నష్టం చేస్తాయని ఆయన శుక్రవారం కడప ప్రెస్ క్లబ్‌లో పేర్కొన్నారు. ప్రజలకు నిజాలు తెలియజేయాలని సూచించారు.