కడప శిల్పారామంలో ఆదివారం వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు కన్నుల పండువగా జరిగాయి. పరిపాలన అధికారి కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో, పద్మాకర్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ వేదికపై చిన్నారులు అదరగొట్టారు. పల్లె కట్టుబాట్లు ఉట్టిపడేలా సాంప్రదాయ వస్త్రాలు ధరించి మూషిక వాహనము, మోక్షిత వైష్ణవి, గరుడ గమనం గీతాలకు జానపద, శాస్త్రీయ నృత్యాలు చేసి వీక్షకుల చప్పట్లు అందుకున్నారు.