టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి బుధవారం కడపలో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు. 12 ఏళ్లు జిల్లా అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. నూతన అధ్యక్షుడు భూపేష్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు. లోకేష్ కృషితో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని, జగన్ విష ప్రచారాలను తిప్పికొట్టాలని, రాబోయే 15 ఏళ్లు కూటమే అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు. రాజంపేటను కడపలో కలపడంపై హర్షం వ్యక్తం చేశారు.