గురువారం మైదుకూరుకు చెందిన సూర్యనారాయణ (42) తన కుమారుడిని సీకే. దిన్నె మండల పరిధిలోని చైతన్య పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న వెంకటనారాయణను ద్విచక్రవాహనంపై పాఠశాలలో దింపేందుకు బయలుదేరారు. జయరాజ్ గార్డెన్ వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం వారి బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సూర్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన కుమారుడు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. సీఐ బాలమద్దిలేటి తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శుక్రవారం తెలిపారు.