కడప: మత్తును వీడండి - కుటుంబంతో గడపండి: ఎస్పీ నచికేత్

3చూసినవారు
కడప: మత్తును వీడండి - కుటుంబంతో గడపండి: ఎస్పీ నచికేత్
కడప ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ బుధవారం జన విజ్ఞాన వేదిక రూపొందించిన 'ఉసురు తీస్తున్న మత్తు పదార్థాలు' పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మత్తుకు దూరంగా ఉండి, నూతన సంవత్సరాన్ని తల్లిదండ్రులతో ఆనందంగా గడపాలని ఎస్పీ సూచించారు. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో హైస్కూల్ విద్యార్థులు మత్తుకు బానిసలవుతున్నారని జేవీవీ నేత సరస్వతి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ రాహుల్, వెంకటేశ్వర్లు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్