ఆదివారం చితలమడుగు పల్లెలో 'బేటీ బచావో, బేటీ పడావో' కార్యక్రమం నిర్వహించారు. యోగి వేమన యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ఎల్ ఎండ్ యూనిట్ 9 ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా శిశు రక్షణ, విద్యకు ప్రాధాన్యం, ప్రతి బాలికకు విద్యా హక్కు, భద్రత, సమాన అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని శ్రీనివాసరావు తెలిపారు. బాలికలు చదువుకుంటే దేశం అభివృద్ధి సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు. పోస్టర్ క్యాంపెయిన్లు, ర్యాలీలు, గ్రామాల్లో గడపగడపకు వెళ్లి అవగాహన కల్పించారు.