కడప: అక్రమంగా బీఈడీ అడ్మిషన్లు.. రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు

960చూసినవారు
కడప: అక్రమంగా బీఈడీ అడ్మిషన్లు.. రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు
ఎడ్‌సెట్ నిర్వహించక ముందే స్థానిక విద్యార్థులకు అన్యాయం చేస్తూ, ఒడిశా వారికి బీఈడీ అడ్మిషన్లు ఇస్తున్న కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐబీఎస్‌యూ అధ్యక్షుడు జగన్ రాథోడ్ డిమాండ్ చేశారు. మంగళవారం వైవీయూ రిజిస్ట్రార్ పద్మకు వినతిపత్రం అందజేస్తూ, స్థానిక కోటాను తుంగలో తొక్కుతూ, లక్షల రూపాయలకు సీట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కనీస వసతులు లేని కాలేజీలను వెంటనే తనిఖీ చేసి ప్రక్షాళన చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్