కడప: విద్యార్థుల్లో పరిశోధనాపై ఆసక్తిని పెంపొందించాలి

5చూసినవారు
కడప: విద్యార్థుల్లో పరిశోధనాపై ఆసక్తిని పెంపొందించాలి
యోగి వేమన విశ్వవిద్యాలయంలో శుక్రవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బిందు మాధవ రెడ్డి విద్యార్థులకు “డయాబెటిస్, క్యాన్సర్‌లో శక్తి సమతుల్యత” పై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులలో పరిశోధన పట్ల ఆసక్తిని పెంపొందించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి అవసరమైన ఆలోచనల గురించి కూడా ఆయన వివరించారు. ప్రొఫెసర్ రాజమోహన్ రాయ్ విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్