కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై అటవీ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపారు. జిల్లా అడవుల నుంచి ఢిల్లీకి ఎర్రచందనం సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్ల ముఠాను ఫారెస్ట్ అధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు స్మగ్లర్లను అధికారులు అరెస్ట్ చేసినట్లు జిల్లా అటవీశాఖ అధికారి వినీత్ కుమార్ పేర్కొన్నారు. 66 ఎర్రచందనం దుంగలు, రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని సీజ్ చేశారు.