కడప: అశోక్ నగర్‌లో పారిశుద్ధ్య మెగా డ్రైవ్

8చూసినవారు
కడప: అశోక్ నగర్‌లో పారిశుద్ధ్య మెగా డ్రైవ్
కడప నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అశోక్ నగర్ సచివాలయం పరిధిలో బుధవారం 'స్వచ్ఛ కడప' లక్ష్యంగా 100 మంది కార్మికులు వీధులు, కాలనీలు, డ్రైనేజీలను శుభ్రం చేశారు. కమిషనర్ రాకేష్ చంద్ర పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానికులకు చెత్త విభజనపై అవగాహన కల్పించి డస్ట్ బిన్లను అందజేశారు. నగరంలోని అన్ని వార్డుల్లోనూ దశలవారీగా మెగా డ్రైవ్ అమలు చేస్తామని అధికారులు తెలిపారు. పరిశుభ్రతలో పౌరులదే కీలక పాత్ర అని నొక్కి చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you