కడప నగరంలో సూపర్ సిక్స్ పథకంలో భాగంగా, సోమవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవి పాల్గొన్నారు. అశోక్ నగర్ వాసి కస్తూరి కమలమ్మ, షేక్ పర్వీన్‌లకు రూ. 4000 చొప్పున స్పౌజ్ వితంతు పింఛన్లను ఆమె అందజేశారు. భర్త మరణించిన వెంటనే పింఛన్ మంజూరు కావడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.