కడప: వ్యవసాయ యంత్రాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానం: కలెక్టర్

3చూసినవారు
కడప: వ్యవసాయ యంత్రాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానం: కలెక్టర్
కడప జిల్లాలో వ్యవసాయాన్ని ఆధునికీకరించి, రైతుల ఆదాయం పెంచే లక్ష్యంతో 'స్మామ్' పథకం సమర్థవంతంగా అమలు జరుగుతోందని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. యంత్రాల వాడకం వల్ల కూలీల ఖర్చు తగ్గి, దిగుబడులు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. అర్హులైన రైతులు రాష్ట్ర ప్రభుత్వ 'ఈ-సీడ్' పోర్టల్ (https://eseed.ap.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్