ఈ నెల 28న జరగనున్న బక్రీద్ పండుగను ప్రశాంతంగా నిర్వహించేందుకు కడప జిల్లా వ్యాప్తంగా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. పశువుల రవాణా, నకిలీ సోషల్ మీడియా పోస్టులపై పోలీసులతో ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ప్రజల ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, సమాచారం కోసం 08562-246344 నంబర్‌ను సంప్రదించాలని కలెక్టర్ కోరారు.