కడప: రబీ పంటల బీమాకు 15 వరకు గడువు - వారోత్సవాల ప్రారంభం

9చూసినవారు
రబీలో ప్రకృతి వైపరీత్యాల నుంచి పంట రక్షణకు బీమా చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ సూచించారు. ఖరీఫ్‌తో పోలిస్తే రబీలో నమోదు తక్కువగా ఉందని, అవగాహన కోసం డిసెంబరు 1-7 వరకు బీమా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 60,411 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. రైతులు ఆధార్, భూమి, బ్యాంకు పత్రాలతో సీఎస్సీ కేంద్రాల్లో ఈనెల 15లోపు ప్రీమియం చెల్లించి బీమా నమోదు చేసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్