కడప అటవీ శాఖ గోడౌన్ నుండి 917 ఎర్రచందనం దుంగలు మాయమైన ఘటనలో మాజీ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ తాయన్నపై కడప వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. 2014-15 మధ్య ఆయన బాధ్యతలు నిర్వహించిన సమయంలో, గోడౌన్‌లో ఉండాల్సిన 1430 దుంగల్లో కేవలం 517 మాత్రమే మిగిలాయి. ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు, పదేళ్ల తర్వాత ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది.